తెలంగాణ

telangana

ETV Bharat / state

GROUNDWATER LEVELS: రాష్ట్రంలో 3 మీటర్లకు పైగా పెరిగిన భూగర్భ జలమట్టం

రాష్ట్రంలో భూగర్భ జలమట్టం(GROUNDWATER LEVELS) 3 మీటర్లకు పైగా పెరిగింది. ఈ ఏడాది జులైలో కురిసిన భారీ వర్షాలతో సగటు జలమట్టం 6.07గా నమోదైంది. గరిష్ఠంగా మెదక్ జిల్లాలో సగటున 13.79 మీటర్ల వద్ద భూగర్భ జలాలు ఉన్నాయని భూగర్భజల శాఖ వివరించింది.

By

Published : Aug 4, 2021, 1:37 PM IST

ground water levels in telangana, telangana groundwater
తెలంగాణలో భూగర్భజలాలు, పెరిగిన భూగర్భ జలమట్టం

రాష్ట్రంలో భూగర్భ జలమట్టం(GROUNDWATER LEVELS) మూడు మీటర్లకు పైగా పెరిగింది. ఈ ఏడాదిలో జులై వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 48శాతం అధిక వర్షపాతం నమోదైంది. భూగర్భ జలాలు కూడా పెరిగాయి. జూలై నెలలో రాష్ట్ర భూగర్భ జలమట్టం సగటు 6.07 మీటర్లుగా నమోదైంది.

మొత్తం 33 జిల్లాలకుగాను 11 జిల్లాల్లో ఐదు మీటర్ల లోపే ఉండగా.. 20 జిల్లాల్లో ఐదు నుంచి పది మీటర్ల లోపు ఉంది. రెండు జిల్లాల్లో మాత్రమే 10 మీటర్లకు పైగా ఉంది. నిరుడితో పోలిస్తే అన్ని జిల్లాల్లోనూ భూగర్భ జలాలు పెరిగాయి. గత పదేళ్లతో పోలిస్తే రాష్ట్రంలోని 592 మండలాలకుగాను 579 మండలాల్లో పెరుగుదల ఉందని భూగర్భజల శాఖ తెలిపింది.

ఈ ఏడాది మే నెలతో పోలిస్తే 3.12 మీటర్ల మేర, జూన్‌తో పోలిస్తే 2.45 మీటర్ల మేర జులైలో భూగర్భ జలమట్టం పెరిగింది. వరంగల్ గ్రామీణ జిల్లాలో సగటున కేవలం 2.57 మీటర్ల వద్ద భూగర్భ జలాలు ఉండగా... గరిష్ఠంగా మెదక్ జిల్లాలో సగటున 13.79 మీటర్ల వద్ద ఉన్నాయని భూగర్భజల శాఖ వివరించింది.

ఇదీ చదవండి:Kidnap: బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం... పాల్పడింది తల్లే

ABOUT THE AUTHOR

...view details