రాష్ట్రంలో భూగర్భ జలమట్టం పెరిగింది. ఈ సీజన్లో విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. మే నెలతో పోలిస్తే సెప్టెంబర్ నెల వరకు ఏకంగా 622 టీఎంసీల మేర భూగర్భ జలాలు పెరిగినట్లు భూగర్భ జలశాఖ తెలిపింది. సెప్టెంబర్ నెలాఖరు వరకు రాష్ట్రంలో సగటున 50 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. 27 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా, మిగతా 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా... ఈ ఏడాది లోటు వర్షపాతం ఉన్న జిల్లాలే లేవు.
రాష్ట్రంలో భారీగా పెరిగిన భూగర్భ జలాలు
రాష్ట్రంలో ఈ సీజన్లో విస్తారంగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. సగటు భూగర్భ జలమట్టం 5.38 మీటర్లు కాగా.. గత ఏడాది సెప్టెంబర్ కంటే 4.47 మీటర్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెల వరకు ఏకంగా 622 టీఎంసీల మేర భూగర్భ జలాలు పెరిగినట్లు భూగర్భ జలశాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో మొత్తం 589 మండలాలకు గానూ ఏకంగా 427 మండలాల్లో 20 శాతం కంటే అధికంగా వర్షాలు పడ్డాయి. 146 మండలాల్లో సాధారణ, మిగిలిన 16 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా రాష్ట్రంలో భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది. రాష్ట్రంలో సగటు భూగర్భ జలమట్టం 5.38 మీటర్లు కాగా.. గత ఏడాది సెప్టెంబర్ కంటే 4.47 మీటర్లు పెరిగాయి. మే నెలతో పోలిస్తే కూడా సెప్టెంబర్ వరకు 5.90 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. మహబూబాబాద్ జిల్లా గొల్లచెర్లలో కేవలం 0.01 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉండగా... నల్గొండ జిల్లా కుదాభక్షపల్లిలో అత్యంత లోతులో 53.11 మీటర్ల లోతున ఉన్నాయి.
ఇదీ చూడండి.. ధరణి పోర్టల్ ప్రారంభానికి శరవేగంగా ఏర్పాట్లు.. నేడు సీఎస్ సమీక్ష