రైతులకు వేరుశనగ విత్తనాలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి పాలమూరుతోపాటు నల్గొండ, రంగారెడ్డి, మెదక్, జిల్లాల్లో వేరుశనగ సాగు చేస్తారని మంత్రి సూచించారు. రబీలో 60 నుంచి 70వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేసినట్లు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 21న విత్తనాల కోసం టెండర్లు పిలిచామని స్పష్టం చేశారు. తెలంగాణ సీడ్స్ వద్ద 10క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది సాగు ఆశాజనకంగా ఉన్నందున డిమాండ్ పెరుగుతుందని అంచనాకు వచ్చామని, రబీ రాకకు ముందే వేరుశనగ సాగుకు రైతులు సిద్దమవుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
వేరుశనగ విత్తనాలు అందుబాటులో ఉంచాలి: మంత్రి నిరంజన్ రెడ్డి - రబీ
రబీ రాకకు ముందే రైతులకు వేరుశనగ విత్తనాలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. రబీలో వేరుశనగ సాగు పెరగనున్న నేపథ్యంలో అధికారులతో హాకా భవన్‌లో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
'రబీలో వేరుశనగ సాగు ఆశాజనకం'