లాక్ డౌన్ సమయంలో 11లక్షల మందికి ఆహారాన్ని అందించామని... పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్‌లో హనీ వెల్ ఐటీ కంపెనీ సహకారంతో సీడ్స్ అనే స్వచ్ఛంద సంస్థ నిరుపేదలకు నిత్యావస వస్తువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
లాక్‌డౌన్‌లో 11 లక్షల మందికి ఆహారం అందించాం: సీపీ సజ్జనార్ - నిత్యవసరాల పంపిణీ తాజా వార్తలు
లాక్ డౌన్ సమయంలో 11లక్షల మందికి ఆహారాన్ని అందించామని... పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. కరోనా ప్రభావంతో పేదలతో పాటు హిజ్రాలు పడుతున్న ఇబ్బందులపై సీపీ సజ్జనార్ సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో చర్చించారు. వారికి ఉపాధి కల్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు.
లాక్‌డౌన్‌లో 11 లక్షల మందికి ఆహారం అందించాం: సీపీ సజ్జనార్
నగరంలో 2500 మందిని ఎంపిక చేసి.. వారందరికీ నిత్యావసర వస్తువులు ఈ సంస్థ అందిచనుంది. మొదటి విడతగా 500 మందికి అంజేశారు. కరోనా ప్రభావంతో పేదలతో పాటు హిజ్రాలు పడుతున్న ఇబ్బందులపై సీపీ సజ్జనార్ సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో చర్చించారు. వారికి ఉపాధి కల్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు గుర్తింపు కార్డులు లేని వారి సమస్యను ప్రభుత్వానికి తెలియజేస్తామని వివరించారు.