లాక్డౌన్తో ఉపాధి లేక ఇబ్బంది పడుతోన్న వలస కార్మికులు, చిరు వ్యాపారులకు తెలంగాణ ఏరియా స్వదేశీ జాగరన్ మంచ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. హైదరాబాద్ అంబర్పేట్లో రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన చిరు వ్యాపారుల ఇళ్లకు వెళ్లి సరుకులు పంపిణీ చేశారు.
చిరు వ్యాపారులకు సరుకుల పంపిణీ - groceries to street vendors in ambarpet
కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్డౌన్తో చిరు వ్యాపారులకు ఉపాధి కరవైంది. తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తోన్న వారికి తెలంగాణ ఏరియా స్వదేశి జాగరన్ మంచ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు.
చిరువ్యాపారులకు సరుకుల పంపిణీ
లాక్డౌన్ వల్ల జీవనోపాధి కోల్పోయిన వారిని ఆదుకోవడానికి దాతలు, ప్రజాప్రతినిధులు ముందుకురావాలని జాగరన్ సభ్యులు కోరారు. కార్మికులంతా మరికొన్ని రోజులు సంయమనం పాటించి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.