తెలంగాణ

telangana

ETV Bharat / state

రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ - తెలంగాణ వార్తలు

రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శ్రీ సాయి శాంతి సేవ సహాయ సంస్థ, శ్రీ సాయి పరబ్రహ్మ సహకారంతో 25 మందికి అందించారు. గతేడాది నుంచి తమ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

groceries distribution, red cross society
నిత్యావసరాలు పంపిణీ, రెడ్ క్రాస్ సొసైటీ

By

Published : Jun 18, 2021, 11:38 AM IST

కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన పేదలకు ఎంతోమంది దాతలు అండగా నిలుస్తున్నారు. 25 మంది నాల్గో తరగతి సిబ్బందికి హైదరాబాద్ సైఫాబాద్​లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ కార్యాలయంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. శ్రీ సాయి శాంతి సేవ సహాయ సంస్థ, శ్రీ సాయి పరబ్రహ్మ సహకారంతో బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు.

ఈ విపత్కర కాలంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వారికి సాయం చేయడం అంటే.. వారి రుణాన్ని తీర్చుకోవడమేనని రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు భీం రెడ్డి అన్నారు. సాయం చేయడానికి ముందుకొచ్చిన సంస్థ నిర్వాహకులు ఎర్రం పూర్ణ శాంతి గుప్తా, గాయత్రి దేవిని అభినందించారు. గతేడాది నుంచి తమ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:రోజు విడిచి రోజు నీరు.. నేటి నుంచి సరఫరా

ABOUT THE AUTHOR

...view details