కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియమ నిబంధనల ప్రకారం పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు సర్కారు జీతాలు ఇస్తున్నాయి. కానీ.. ప్రైవేట్ టీచర్ల పరిస్థితే ఆగమ్య గోచరంగా తయారైంది. అటు బడులు తెరవక.. జీతాలు లేక.. వేరే ఉపాధి మార్గం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇల్లు గడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు అండగా ఉండాలని పిలుపునిస్తూ.. కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ నర్మదా మల్లిఖార్జున్ ప్రైవేట్ టీచర్లకు నిత్యావసర సరకులు పంచారు.
ప్రైవేట్ టీచర్లకు సరుకులు పంపిణీ - సికింద్రాబాద్ వార్తలు
కరోనా కారణంగా పాఠశాలలు తెరవకపోవడం వల్ల ప్రైవేటు టీచర్లు, అధ్యాపకులు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ప్రతీ ఒక్కరు తమకు తోచినంతగా వారికి సహాయం చేయాల్సిన అవసరం ఉందని కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షులు నర్మదా మల్లిఖార్జున్ అన్నారు. కంటోన్మెంట్ ఆక్స్ఫర్డ్ పాఠశాల టీచర్లకు ఆయన నిత్యావసర సరుకులు పంచారు.

ప్రైవేట్ టీచర్లకు సరుకులు పంపిణీ
సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఆయన ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ టీచర్లు దయనీయ స్థితిలో ఉన్నారని.. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని ఆయన అన్నారు.
ఇవీ చూడండి: 'కరోనాను కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం'