పేదలకు అండగా నిలుస్తోన్న దాతలు - lock down effect
కరోనా మహమ్మారి విజృభిస్తున్న వేళ... ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు పలు సంస్థలు చేయూతనిస్తున్నాయి. తమకు తోచిన రీతిలో సాయం చేస్తూ దాతృత్వం చాటుకుంటున్నాయి.
పేదలకు అండగా నిలుస్తోన్న దాతలు
లాక్డౌన్ వేళ ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు దాతలు అండగా నిలుస్తున్నారు. హైదరాబాద్ కొత్తపేటలో ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమైక్య ఆధ్వర్యంలో పేదవారికి నిత్యావసరాల సరుకులను పంపిణీ చేశారు. దాదాపు వంద మందికి పైగా పేదలకు రూ.80వేల విలువైన నిత్యావసరాలు అందజేశారు. ప్రతీ ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ... కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వానికి సహకరించాలని దాతలు సూచించారు.