హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వలస కూలీలకు వివేకానంద సేవా సమితి అపన్నహస్తం అందించింది. లాక్‌డౌన్ కారణంగా ఉపాధిలేక పస్తులుంటున్న కార్మికులను గుర్తించిన ప్రముఖ బిల్డర్ పి.రాధాకృష్ణ నిత్యావసర సరకులు అందేలా ఏర్పాటు చేశారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన వివేకానంద సేవా సమితి - హైదరాబాద్లో వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ
వలస కూలీలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో వలస కార్మికులకు వివేకానంద సేవా సమితి అపన్నహస్తం అందించింది. నిత్యావసరాలు పంపిణీ చేసింది.
వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన వివేకానంద సేవా సమితి
రాధాకృష్ణ సహకారంతో వివేకానంద సేవా సమితి గౌరవాధ్యక్షులు, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్ అధ్వర్యంలో అల్విన్ క్రాస్ రోడ్, మియాపూర్తోపాటు ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న 100మంది వలస కూలీల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
ఇవీచూడండి:తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్