తెలంగాణ

telangana

ETV Bharat / state

వరద బాధితులకు నిత్యావసర సరకుల పంపిణీ - ముషీరాబాద్‌ నియోజకవర్గంలో వరద బాధితులకు నిత్యావసర సరకుల పంపిణీ

నగరంలో భారీ వర్షాలతో వరద నీటిలో చిక్కుకుపోయిన బాధితులను ఆదుకోవడానికి హిదాయత్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాల్లో వరద బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేసింది.

groceries distribution in musheerabad constituency
వరద బాధితులకు నిత్యావసర సరకుల పంపిణీ

By

Published : Oct 20, 2020, 3:12 PM IST

వరద ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని హిదాయత్ వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ షహీద్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌ ముషీరాబాద్ నియోజకవర్గంలోని మురికివాడ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ముషీరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు జాంబవి నగర్, వినోబా నగర్ వాసులకు ఫౌండేషన్ ప్రతినిధులు పది రకాల నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

వరద బాధితులకు ప్రభుత్వంతో పాటు తమకు కూడా సేవ చేసే అవకాశం లభించిందని షహీద్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం

ABOUT THE AUTHOR

...view details