తెలంగాణ

telangana

ETV Bharat / state

రాంగోపాల్ పేట్​లో సరుకులు పంచిన కార్పొరేటర్ - SECUNDERABAD

సికింద్రాబాద్​ పరిధి రాంగోపాల్ పేట్​లోని పలు కాలనీల్లో పేద ప్రజలకు డివిజన్ కార్పొరేటర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

తెలంగాణ పేపర్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ
తెలంగాణ పేపర్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ

By

Published : May 4, 2020, 1:55 PM IST

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ డివిజన్​ పరిధిలోని నల్లగుట్ట ఎఫ్ లైన్, సీ లైన్​లో తెలంగాణ పేపర్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ అరుణ గౌడ్ నిత్యావసర సరుకులు అందచేశారు. పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బస్తీవాసులకు కిరాణా సామగ్రి అందజేశామని ఆమె అన్నారు.

ఉపాధి లేని వారికి...

లాక్​డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న బస్తీ వాసులకు కిరాణా వస్తువులు పంపిణీ చేశామని కార్పొరేటర్ వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆమె సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ నంద కిషోర్, సెక్రెటరీ నారాయణ్, వైస్ ప్రెసిడెంట్ శ్యామ్, శ్రీనాథ్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : భారత్​లో 1,373కు పెరిగిన కరోనా మరణాలు

ABOUT THE AUTHOR

...view details