కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్నందున నిరుపేదలకు నిత్యావసర సరకులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ కవితా రెడ్డి పంపిణీ చేశారు. బంజారాహిల్స్‌లోని వెంకటేశ్వర కాలనీ డివిజన్ పరిధిలోని దోబీఘాట్, నాయుడు నగర్ బస్తీలో నిరుపేదలకు 5 కేజీల బియ్యం, సరుకులు అందించారు. కరోనా వైరస్‌కు సంబంధించి రాష్ట్రంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
'బంజరాహిల్స్‌లోని నిరుపేదలకు సరకులు పంపిణీ' - BANJARA HILLS KHAIRATABAD
ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని పేద బస్తీల్లో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ కవితారెడ్డి చేతుల మీదుగా కిరాణా సామగ్రి అందించారు.

రోజుకో బస్తీ...
నియోజకవర్గంలో పేద ప్రజల ప్రాంతాలను ఎంపిక చేసుకుని ప్రతి రోజు వారికి సహాయం అందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అభాగ్యులకు ఆహార పదార్థాలను అందించేందుకు అన్నదాన కేంద్రాలు సైతం ఏర్పాటు చేస్తున్నామని కార్పొరేటర్ కవితారెడ్డి అన్నారు. ప్రతి డివిజన్ పరిధిలోని బస్తీల్లో పేదలకు సరకులు అందిస్తున్నామని స్పష్టం చేశారు. పేదల ఆకలి తీర్చేందుకు డివిజన్లో ఏడు అన్నపూర్ణ భోజన వసతి కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ తెరాస నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.