లాక్డౌన్లో ఇబ్బంది పడుతోన్న పేదలకు.. హైదరాబాద్ కూకట్పల్లిలోని హోలిస్టిక్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆపన్న హస్తం అందిస్తోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో కూకట్పల్లి ట్రాఫిక్ సీఐ బోస్ కిరణ్ 400 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
ఆటో డ్రైవర్లకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేయూత - groceries to auto drivers in hyderabad
లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలు, కార్మికులు, ఆటో డ్రైవర్లకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేయూతనందించింది. హైదరాబాద్ కూకట్పల్లిలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో నిత్యావసరాలు అందజేశారు.
ఆటో డ్రైవర్లకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేయూత
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సహకారంతో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం చాలా గొప్పదని కూకట్పల్లి ట్రాఫిక్ సీఐ బోస్ కిరణ్ అన్నారు. లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్న వారికి ప్రతిఒక్కరు తోచినంత సాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై రాజు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి ఆర్య, హోలిస్టిక్ ఆసుపత్రి వైద్యులు సుబ్బారావు, సంగీత పాల్గొన్నారు.