భారత్ సేవాశ్రమం సంఘ్ హైదరాబాద్ కార్యదర్శి మునీశ్వరానంద, సహాయ కార్యదర్శి వెంకటేశ్వరానంద కాచిగూడలోని వందమంది బెంగాలీ కార్మికుల కుటుంబాలకు 20 సంచుల బియ్యం, రెండు సంచుల కందిపప్పు పంపిణీ చేశారు.
బెంగాలీ కార్మికుల కుటంబాలకు నిత్యావసరాల పంపిణీ
కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ... ప్రజలకు తమ వంతు సాయం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. నిత్యావసరాలు పంపిణీ చేస్తూ... మహమ్మారి సోకకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేస్తున్నారు.
బెంగాలీ కార్మికుల కుటంబాలకు నిత్యావసరాల పంపిణీ
కరోనా వైరస్ అంటు వ్యాధి నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవాలని సూచించారు. భౌతిక దూరం పాటించాలని, చేతులు కడుక్కోవాలనీ అవగాహన కల్పించారు. కరోనా వ్యాధికి మందులు లేనందున అందరూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న బెంగాలీ వలస కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఇవీ చూడండి:అన్ని అవయవాలపైనా కరోనా ముప్పేట దాడి!