తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్రాహ్మణులకు నిత్యావసరాల పంపిణీ - lock down upsate

లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చినా తమ జీవనం మెరుగుపడలేదని బ్రాహ్మణులు విచారం వ్యక్తం చేశారు. జంటనగరాల్లోని సుమారు 250 మంది అర్చకులకు అడిక్​మెట్​లో నిత్యావసరాలు పంపిణీ చేశారు.

groceries distributed to priest in hyderabad
బ్రాహ్మణులకు నిత్యావసరాల పంపిణీ

By

Published : May 24, 2020, 3:19 PM IST

లాక్​డౌన్ సడలింపులు ఇచ్చినా బ్రాహ్మణుల జీవన విధానంలో మాత్రం మార్పు రాలేదని సేవాదాన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి స్రవంతి ఆవేదన వ్యక్తం చేశారు. జంటనగరాల్లోని అర్చకులు, పురోహితులు, బ్రాహ్మణులకు శుభకార్యాలు లేక అనేక అవస్థలు పడుతున్నారని గ్రహించిన స్వచ్ఛంద సంస్థ... అడిక్​మెట్ లలితనగర్​లో సుమారు 250 మంది బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

కరోనా రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని స్రవంతి విన్నవించారు. శుభకార్యాలతో బిజీగా ఉండాల్సిన సమయంలో కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకునేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని పురోహితులు తెలిపారు.

ఇదీ చూడండి:'కరోనా వ్యాప్తి తగ్గితేనే ఆ పథకాలు సాధ్యం!'

ABOUT THE AUTHOR

...view details