తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్వాన్​లో సరుకులు పంపిణీ చేసిన హైదరాబాద్ సీపీ - HYDERBAD CP

హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్​లో ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ కూలీలకు, పేదలకు కిరాణా సామగ్రి అందించారు.

పేదలకు కిరాణా సామగ్రి అందించిన సీపీ
పేదలకు కిరాణా సామగ్రి అందించిన సీపీ

By

Published : May 2, 2020, 1:32 PM IST

హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గంలోని మొగల్ కానాల వద్ద స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్​లో సీపీ అంజనీకుమార్ సరుకులు పంపిణీ చేశారు. సుమారు 500 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులు అందించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన దాతలు షేక్ హమీద్​తో పాటు అతని సోదరులను సీపీ అంజనీకుమార్ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details