నిస్వార్థ సేవలు అందించే స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహిస్తామని తెలంగాణ ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ సీతాఫల్మండిలో కారుణ్య వెల్ఫేర్ సొసైటీ అధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకుల పంపిణీతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
'నిస్వార్థ సేవలు అందించే స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహిస్తాం'
పేదలకు నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమంలో ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కారుణ్య వెల్ఫేర్ సొసైటీ అధ్వర్యంలో సీతాఫల్మండిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆయన ప్రారంభించారు.
'నిస్వార్థ సేవలు అందించే స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహిస్తాం'
సొసైటీ ఛైర్ పర్సన్ తోబుల వీణా సరస్వతి అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం అందించే చేయూతలో స్వచ్ఛంద సంఘాలూ తమవంతు పాత్రను పోషించాలని కోరారు. కార్పొరేటర్ కుమారి, సామల హేమ, తెరాస నేతలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కేటీఆర్ పీఏనంటూ డబ్బులు డిమాండ్