తెలంగాణ

telangana

ETV Bharat / state

GRMB Subcommittee Meeting: 17న గోదావరి బోర్డు ఉప సంఘం భేటీ - హైదరాబాద్ వార్తలు

గెజిట్‌ షెడ్యూల్‌-2లో పేర్కొన్న ప్రాజెక్టులపై చర్చించేందుకు ఈ నెల 17వ తేదీన ఐదో దఫా ఉపసంఘం (GRMB Subcommittee) సమావేశాన్ని గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాలకు చెందిన నాలుగు కంపోనెంట్లను బోర్డుకు అప్పగించడంలో తుది నిర్ణయంపై సమావేశం (GRMB Subcommittee Meeting)లో చర్చించున్నారు.

GRMB Subcommittee Meeting
గోదావరి బోర్డు ఉప సంఘం భేటీ

By

Published : Nov 13, 2021, 7:42 AM IST

కేంద్ర గెజిట్‌ అమలుకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) ప్రక్రియను వేగవంతం చేసింది. ఈనెల 17న ఐదో దఫా ఉపసంఘం సమావేశాన్ని (GRMB Subcommittee Meeting) ఏర్పాటు చేసింది. గెజిట్‌ షెడ్యూల్‌-2లో పేర్కొన్న ప్రాజెక్టులపై చర్చించేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన సభ్యులతో హైదరాబాద్‌లోని జలసౌధలో గెజిట్ అమలుపై ఉ.11 గంటలకు ఉపసంఘం (GRMB Subcommittee Meeting) భేటీ కానుంది. రెండు రాష్ట్రాలకు చెందిన నాలుగు కంపోనెంట్లను బోర్డుకు అప్పగించడంలో భాగంగా తుది నిర్ణయం తీసుకునేందుకు ఎజెండా రూపొందించారు. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండే శుక్రవారం ఓ ప్రకటనలో వివరాలు తెలిపారు.

కంపోనెంట్లు ఇవీ..

  • తెలంగాణ పరిధిలోని జె.చొక్కారావు ఎత్తిపోతల పథకంలోని గంగారం పంపుహౌస్‌, శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు (ఒకటో దశ) కింద గీసుకొండ సమీపంలో కాకతీయ కాల్వపై ఉన్న క్రాస్‌ రెగ్యులేటర్‌
  • ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో తొర్రిగెడ్డ ఎత్తిపోతల పంపుహౌస్‌, చంగలనాయుడు ఎత్తిపోతల పంపుహౌస్‌

ఇదీ చూడండి:Rajath Kumar Comments: 'మేం అప్పగిస్తేనే బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు'

Letter to Grmb Chairman: గోదావరి బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ

ABOUT THE AUTHOR

...view details