GRMB Meeting: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 22వ తేదీన సమావేశం కానుంది. హైదరాబాద్‌లోని జలసౌధ వేదికగా జీఆర్ఎంబీ భేటీ జరగనుంది. బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణరెడ్డి, ఇతర సభ్యులు పాల్గొంటారు. బోర్డు పరిధి, నిర్వహణకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌లో కేంద్ర జల్‌శక్తి శాఖ ఇటీవల సవరణ చేసింది. రూ.200 కోట్లు చొప్పున సీడ్ మనీ డిపాజిట్, అనుమతుల్లేని ప్రాజెక్టులకు అనుమతులు తీసుకునేందుకు గడువును మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఆ గడువు జూలై 14వ తేదీతో పూర్తి కానుంది.
GRMB: గెజిట్ నోటిఫికేషన్‌లో జల్‌శక్తి శాఖ మార్పులు.. 22న జీఆర్‌ఎంబీ సమావేశం - జీఆర్ఎంబీ భేటీ
GRMB Meeting: ఈ నెల 22న హైదరాబాద్‌లోని జలసౌధ వేదికగా జీఆర్ఎంబీ భేటీ జరగనుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టులు, డీపీఆర్‌ల అంశంపై భేటీలో చర్చ జరగనుంది.
ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపై బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టులు, డీపీఆర్‌ల అంశంపై కూడా భేటీలో చర్చ జరగనుంది. తెలంగాణకు చెందిన చనాకా - కొరాటా, చౌటుపల్లి హన్మంతురెడ్డి ఎత్తిపోతల పథకం, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకటనగరం పంప్ హౌస్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులపై కూడా చర్చించనున్నారు. వీటితో పాటు రెండు రాష్ట్రాలు, బోర్డుకు సంబంధించిన ఇతర అంశాలపైనా జీఆర్ఎంబీ సమావేశంలో చర్చించనున్నారు.
ఇవీ చదవండి: