వ్యవసాయ రుణమాఫీ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2014 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2018 డిసెంబర్ 11వ తేదీ నాటికి తీసుకున్న పంటరుణాలకు మాఫీ వర్తిస్తుంది.
రైతు రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్.. మార్గదర్శకాలు విడుదల - రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్
18:12 March 17
రైతు రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్.. మార్గదర్శకాలు విడుదల
ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేస్తారు. పట్టణ ప్రాంతాల్లోని బ్యాంకుల నుంచి పంటల కోసం తీసుకున్న బంగారం రుణాలకు మాఫీ వర్తించదు. 25 వేల రూపాయల్లోపు ఉన్న రుణాలను ఒకే దఫాలో... లక్ష రూపాయల వరకు నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. ఆ మేరకు రైతులకు మాఫీ మొత్తాన్ని చెక్కుల ద్వారా అందిస్తారు.
గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితా రూపొందించి... మండల స్థాయిలో బ్యాంకర్ల ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి జాబితా ఖరారు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రుణమాఫీ అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేసి పర్యవేక్షించనుంది.
ఇదీ చూడండి:ఆర్బీఐ అభయంతో లాభాల్లో స్టాక్ మార్కెట్లు