రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 'జబర్ధస్త్'గా సాగుతోంది.. నటుడు సుడిగాలి సుధీర్, బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన జబర్ధస్త్ ఫేమ్ గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ తమ నివాసాలలో మొక్కలు నాటారు. ఆకుపచ్చ ప్రపంచం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థను అభినందించినారు. అనంతరం గెటప్ శ్రీను.... పూరి జగన్నాథ్, ఆకాష్ పూరి, ఛార్మికి గ్రీన్ ఛాలెంజ్ విసరగా.... యాంకర్ ప్రదీప్, పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మానసి జోషి, కమెడియన్ హైపర్ ఆదికి ఆటో రామ్ ప్రసాద్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.
'జబర్ధస్త్' ఛాలెంజ్... మొక్కలు నాటిన శ్రీను, రామ్ ప్రసాద్ - green india challenged by jabardasth comedians
గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా నటుడు సుడిగాలి సుధీర్, బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ నుంచి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన జబర్ధస్త్ ఫేం ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను తమ నివాసాలలో మొక్కలు నాటారు.
!['జబర్ధస్త్' ఛాలెంజ్... మొక్కలు నాటిన శ్రీను, రామ్ ప్రసాద్ green india challenged by jabardasth comedians](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5530612-thumbnail-3x2-green-rk.jpg)
జబర్ధస్త్‌గా సాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్