Green India Challenge: చెట్లు మనుషుల ఆత్మకు శాంతినిస్తాయని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా బంజారాహిల్స్ పంచవటి కాలనీలో ఎంపీ సంతోష్ కుమార్తో కలిసి ఆయన మొక్కలు నాటారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇంగ్లీష్ సాహిత్యంలో చెట్లు వాటి వేర్లు మానవ ఎదుగుదలను.. మనిషి తన మూలాలను మరిచిపోవద్దనే మూల సూత్రాన్ని వివరిస్తాయని ఆండ్రూ ఫ్లెమింగ్ అన్నారు.
అందుకే మనిషి తన ఎదుగుదలను మొక్కలతో పోల్చుకోవాలని ఆండ్రూ ఫ్లెమింగ్ సూచించారు. తాను గత 5 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఎంతో మార్పు వచ్చిందన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన పచ్చదనంతో కనువిందు చేస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు, కాలాలకు అతీతంగా.. నిత్యం మొక్కలు నాటించే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అద్భుతమని తెలిపారు.