గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మెుక్కలు నాటిన కళాతపస్వీ - director Vishwamath accepts santhosh kumars green challenge
గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి హైదరాబాద్‌లో మెుక్కలు నాటిన ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌కు ఎంపీ సంతోశ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
![గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మెుక్కలు నాటిన కళాతపస్వీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4944542-thumbnail-3x2-plants.jpg)
గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటినందుకు ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌కు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆయనను కలిసి ధన్యవాదాలు తెలిపారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం మంచి సందేశాన్ని ఇస్తోందని.. భవిష్యత్ తరాలకు చక్కటి పర్యావరణం అందించేందుకు దోహద పడుతుందని విశ్వనాథ్ పేర్కొన్నారు.
మరోవైపు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన బిజూ జనతాదళ్ రాజ్యసభ పక్ష నేత ప్రసన్న ఆచార్య ఒడిశాలో మొక్కలు నాటారు. పర్యావరణం నానాటికీ దెబ్బతింటున్న సందర్భంగా సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. మరో ముగ్గురు ఎంపీలు సస్మిత్ పాత్ర, విజయ్ పాల్, అనుభవ్ మొహంతికి సంతోష్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.