హరిత భవనాలు నిర్మించే సంస్థలతో కలిసి గృహ రుణ సంస్థ ఐఐఎఫ్‌ఎల్ కుటుంబ్ పేరుతో హైదరాబాద్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పలు సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని ఐఐఎఫ్‌ఎల్ సంస్థ డైరెక్టర్ మోనురాత్రా అన్నారు.
భవిష్యత్తులో హరిత భవనాలు : ఐఐఎఫ్‌ఎల్ - IIFL home loan industry Green buildings in the future
పర్యావరణ హితం కోరుతూ అందుబాటు ధరల్లో హరిత భవనాలను ప్రోత్సహించేలా గృహ రుణ సంస్థ ఐఐఎఫ్‌ఎల్ హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సదస్సును నిర్వహించింది.
భవిష్యత్తులో హరిత భవనాలు : ఐఐఎఫ్‌ఎల్
హరిత భవనాల కోసం అవసరమైన మౌలిక వసతుల కల్పించేందుకు ఐఐఎఫ్‌ఎల్ సంస్థ పరిశ్రమ నిపుణులు, రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌తో కలిసి కుటుంబ్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం గ్రీన్ భవనాలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టిందన్నారు. భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రాజక్టులన్నీ గ్రీన్ ప్రాజెక్టుల్లా ఉండేలా బిల్డర్లు కృషి చేయాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి : అరకొర నైపుణ్యమే!