తెలంగాణ

telangana

ETV Bharat / state

జలసంరక్షణ మన అందరి బాధ్యత: గవర్నర్ తమిళి సై - Weather report latest mews

హైదరాబాద్​లో హైటెక్ కన్వెన్షన్ సెంటర్​లో వాతావరణ మార్పులపై గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. వాతావరణ మార్పులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కదలి రావాలని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పిలుపునిచ్చారు.

జలసంరక్షణ మన అందరి బాధ్యత: గవర్నర్ తమిళి సై

By

Published : Sep 26, 2019, 12:13 PM IST

వాతావరణ మార్పులకు సంబంధించి సీఐఐ ఆధ్వర్యంలో హైటెక్ కన్వెన్షన్ సెంటర్​లో గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ హాజరయ్యారు. తక్కువ నీటిని ఉపయోగించడం, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం, సహజ వనరులను పరిరక్షించాలని ఆమె కోరారు. వాతావరణ మార్పులకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా కదలి రావాలని పిలుపునిచ్చారు. నీరు లేకుండా మనవజాతే లేదు... అలాంటి నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తోందని వెల్లడించారు.

జలసంరక్షణ మన అందరి బాధ్యత: గవర్నర్ తమిళి సై

ABOUT THE AUTHOR

...view details