Typography: హైదరాబాద్‌కు చెందిన శశిధర్‌రెడ్డి.. ఓ ఆర్కిటెక్ట్. ముంబయి ఐఐటీలో విజువల్ డిజైనింగ్ చేశారు. శశిధర్‌రెడ్డికి చిన్నప్పటి నుంచి ఆకృతులంటే ఇష్టం. దేనికైనా ఆకృతినివ్వడమంటే ఆసక్తి. ముంబయి ఐఐటీలో చదువుతున్న సమయంలో టైపోగ్రఫీ వైపు ఆకర్షితుడయ్యారు. టైపోగ్రఫీ అంటే అక్షరాలను ఉపయోగించి భావవ్యక్తీకరణం చేయడం. ముంబయి ఐఐటీలో చదువుతున్న రోజుల్లో గౌహతిలో నిర్వహించిన ప్రపంచ టైపోగ్రఫీ పోటీల్లో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 మంది డిజైనర్లు పాల్గొనగా.. శశి తెలుగు 'అ'తో రూపొందించిన చిత్రాన్ని పోటీలో ప్రదర్శించి విజేతగా నిలిచాడు.
టైపోగ్రఫీ ద్వారా అక్షరాలకు సృజనాత్మకత..
'అ' లోని అమ్మను ప్రపంచానికి చూపించిన శశి.. తెలుగు భాషా గొప్పదనం, తెలుగు అక్షరాల సౌందర్యాన్ని మరింత మందికి తెలియజేయాలని అనుకున్నారు. కేవలం ఒక అమ్మతోనే ఆగిపోకుండా.. తెలుగు అక్షరాలకు టైపోగ్రఫీ ద్వారా సృజనాత్మకతను జోడించారు. మద్యం సేవించడాన్ని ఉరితాడుతో పోలుస్తూ అక్షరరూపంలోకి తెచ్చారు. తెలుగుభాషపై అభిమానంతో శ్రీముత్యాల ఫాంట్ రూపొందించారు. ఇదేకాకుండా పిల్లలు సులువుగా అర్థం చేసుకునేలా పుస్తకాలు రూపొందించారు.