తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi Sanjay: ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు - Bandi sanjay birthday celebrations news

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుతలను హైదరాబాద్​లో ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి తమ నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు. పలు సామాజిక కార్యక్రమాల్లో కార్యకర్తలు పాలుపంచుకున్నారు.

Bandi
సంజయ్

By

Published : Jul 11, 2021, 3:37 PM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జన్మదినాన్ని (Bandi Sanjay Birthday) పురస్కరించుకొని నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పార్టీ కార్యాలయం, కూడళ్లలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పలు సామాజిక కార్యక్రమాల్లో కార్యకర్తలు పాలుపంచుకున్నారు.

ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి తమ అధ్యక్షుడు బండి సంజయ్​కు శుభాకాంక్షలు తెలియజేశారు. మాసబ్​ ట్యాంకులోని చాచా నెహ్రూ పార్కులో అంధ విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం, కార్యకర్తలకు వ్యాక్సినేషన్ నిర్వహించారు.

కంటోన్మెంట్ నియోజకవర్గంలోనూ బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కంటోన్మెంట్ మూడవ వార్డులోని కమ్యూనిటీ హాల్​లో బీఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుపుకున్నారు. భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ హాజరై కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వంద మంది చిన్నారులకు కరోనా నేపథ్యంలో మాస్క్​లను అందజేశారు.

బండి సంజయ్ నాయకత్వంలో భాజపా 2023లో కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని రామకృష్ణ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భాజపా బలం పెరగడానికి ప్రధాన కారణం బండి సంజయ్ అని బీఎన్ శ్రీనివాస్ అన్నారు. పేద ప్రజల మధ్య బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ పతనం ప్రారంభమైందని త్వరలోనే భాజపా అధికారంలోకి రానున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details