గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి 300 విద్యుత్ బస్సులను తిప్పుతామని ఆర్టీసీ గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్లను పిలిచే పనిలో ఉన్నామని అన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తే... ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జూబ్లీబస్ స్టేషన్‌లోని ఈడీ కార్యాలయంలో గ్రేటర్ ఆర్టీసీ ఆపరేషన్స్‌కు సంబంధించిన వివరాలను ఈడీ వెల్లడించారు. ఇకపై నల్లని పొగను వెదజిమ్మే ఆర్టీసీ బస్సులను రోడ్లపై తిరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణికులు ఫిర్యాదు చేసేందుకు బస్సుల్లో డిపో మేనేజర్ల చరవాణి నంబర్లను రాయిస్తామని ఈడీ పేర్కొన్నారు. దీనివల్ల బస్సుల సమయ పాలన, ఉద్యోగుల పనితీరు మెరుగవుతుందన్నారు.
'2020 మార్చి నాటికి 300 విద్యుత్ బస్సులు' - గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటెశ్వర్లు
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 300 విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్లు పిలిచే పనిలో ఉన్నామని స్పష్టం చేశారు. పొగ వెదజిమ్మే బస్సులను రోడ్లపై తిరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
!['2020 మార్చి నాటికి 300 విద్యుత్ బస్సులు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4388996-thumbnail-3x2-busgupta.jpg)
2020 మార్చి నాటికి విద్యుత్ బస్సులు