తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆస్తిపన్ను వసూలుకు బల్దియా ప్రణాళికలు - GHMC Commissioner Lokesh Kumar Latest news

ఆస్తి పన్ను బకాయిలపై జీహెచ్​ఎంసీ దృష్టి సారించింది. ఈనెల 31లోపు పన్ను చెల్లించాలని నగరవాసులకు విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది ఇంకా రూ. 508కోట్లు వసూలు చేయాల్సి ఉంది.

ghmc
ghmc

By

Published : Mar 10, 2020, 7:41 PM IST

2019-20 ఆర్థిక సంవ‌త్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను బ‌కాయిల‌ను ఈ నెల 31లోపు చెల్లించాల‌ని జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ సంవ‌త్సరం నిర్దేశించిన ల‌క్ష్యం రూ. 1800 కోట్లు కాగా, నేటి వ‌ర‌కు రూ.1291 కోట్ల 49ల‌క్షలు వ‌సూలయ్యాయి. ఇంకా రూ. 508 కోట్ల 51 ల‌క్షల బ‌కాయిలు రావాల్సి ఉంద‌ని కమిషనర్ వివ‌రించారు.

ఆస్తి పన్ను వ‌సూలు చేసేందుకు ట్యాక్స్ క‌లెక్టర్లు ఇంటింటికి తిరుగుతున్నట్లు తెలిపారు. అలాగే మీ-సేవా, సిటిజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్‌, ఆన్‌లైన్ పేమెంట్ సిస్ట‌మ్ ద్వారా ప్రాప‌ర్టీ ట్యాక్స్ బ‌కాయిల‌ను చెల్లించ‌వ‌చ్చని సూచించారు. ఆన్‌లైన్ చెల్లింపుదారుల రుసుమును జీహెచ్‌ఎంసీ భ‌రిస్తుంద‌ని తెలిపారు. ప్రాప‌ర్టీ ట్యాక్స్ చెల్లింపుల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత‌ స‌ర్కిల్ కార్యాల‌యాల్లోని డిప్యూటీ క‌మిష‌న‌ర్ల‌ను సంప్రదించాల‌ని లోకేష్ కుమార్ సూచించారు.

ఇదీ చూడండి :వసతిగృహంలో విద్యార్థినిలతో పాకి పని

ABOUT THE AUTHOR

...view details