ఈనెల 28, 29 తేదీల్లో పాతబస్తీలో జరుగనున్న మహంకాళి బోనాల జాతరకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. లాల్ దర్వాజలోని మహంకాళి ఆలయంతో పాటు పలు దేవాలయాల వద్ద ఆదివారం బోనాల ఊరేగింపు, రంగం నిర్వహించనున్నారు. లాల్ దర్వాజ నుంచి షాలిబండ, మక్కామసీద్, చార్మినార్, గుల్జార్ హౌజ్, మదీనా మీదుగా నయాపూల్ వరకు ఊరేగింపుతో మూసీనదిలో బోనాల నిమజ్జనం ముగియనున్నట్లు తెలిపారు. వేల సంఖ్యలో భక్తులు రానుందున సుమారు 14వేల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు.
'పాతబస్తీ బోనాల జాతరకు పటిష్ఠ భద్రత'
పాతబస్తీలో జరిగే మహంకాళి బోనాల పండుగకు పటిష్ఠమైన భద్రతను ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర సీపీ అంజనీ కుమర్ వెల్లడించారు.
'పాతబస్తీ బోనాల జాతరకు పటిష్ఠ భద్రత'