- జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం
- జీహెచ్‌ఎంసీ: 149 డివిజన్లలో 46.6 శాతం పోలింగ్
- 2016 బల్దియా ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్
- 2016 ఎన్నికలతో పోలిస్తే అధికంగా 1.31 శాతం పోలింగ్
గ్రేటర్ ప్రజలు జీహెచ్ఎంసీ పోరులో ఉత్సాహంగా పాల్గొన్నారు. మంగళవారం ఉదయం చలిని సైతం లెక్క చేయకుండా వృద్ధులు, దివ్యాంగులు ముందుకు రావడం వల్ల గత ఎన్నికలకన్నా ఎక్కువ పోలింగ్ నమోదైంది. మొత్తం 150 డివిజన్లకు పోటీ జరగ్గా.. ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో బ్యాలెట్ పేపరుపై సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తును ముద్రించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ డివిజన్ ఎన్నికను రద్దు చేసింది. డిసెంబరు 3న రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇక మిగిలిన 149 డివిజన్లలో మొత్తంగా 46.6 శాతం మంది ఓటేశారు.
ఓటు వేసినవారు ఇలా.. | |
పురుషులు | 18,57,041 |
మహిళలు | 15,97,438 |
ఇతరులు | 73 |
మొత్తం | 3454552 |
- పోలింగ్ కేంద్రాలు - 9,101
- పోలింగ్ సిబ్బంది - 36,404
- గ్రేటర్‌లోని జోన్లు - 6
- వాటి పరిధిలోని సర్కిళ్లు - 30
- మొత్తం డివిజన్లు - 150
- 10 నుంచి 40శాతం లోపు పోలింగ్ నమోదైన డివిజన్లు - 17
- 40 నుంచి 50శాతం లోపు పోలింగ్ నమోదైన డివిజన్లు - 93
- 50శాతానికి పైగా పోలింగ్ నమోదైన డివిజన్లు - 39
అత్యధిక పోలింగ్ నమోదైనవి..
కంచన్‌బాగ్ | 70.39% |
ఆర్సీపురం | 67.71% |
పటాన్‌చెరు | 65.77% |
భారతినగర్ | 61.89% |
గాజులరామారం | 58.61% |
నవాబ్ సాహెబ్ కుంట | 55.65% |
బౌద్ధనగర్ | 54.79% |
దత్తాత్రేయ నగర్ | 54.67% |
రంగారెడ్డినగర్ | 53.92% |
జంగంమెట్ | 53.8% |
అత్యల్ప పోలింగ్ నమోదైనవి..
యూసుఫ్‌గూడ | 32.99% |
మెహదీపట్నం | 34.41% |
సైదాబాద్ | 35.77% |
సంతోష్ నగర్ | 35.94% |
మియాపూర్ | 36.34% |
తక్కువ పోలింగ్ నమోదైన డివిజన్లలో పాతబస్తీవే అధికంగా ఉన్నాయి. చివరి 20 డివిజన్లలో 9 పాతబస్తీలోనివే.
- మెహదీపట్నం
- సైదాబాద్
- సంతోష్‌నగర్
- మూసారంబాగ్
- విజయనగర్‌కాలనీ
- ఆజంపుర
- అక్బర్‌బాగ్
- డబీర్‌పురా
- ఐఎస్ సదన్