Grand Nursery Mela 2023 in Hyderabad : హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో గ్రాండ్ నర్సరీ మేళా-2023 (Grand Nursery Mela 2023 in Hyderabad) కన్నుల పండువగా ప్రారంభమైంది. ఈ అఖిల భారత వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శనను.. వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంత్ కె జెండగే లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఆగ్రోస్ సంస్థ ఛైర్మన్ కె.రాములు, తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్స్ సంస్థ ఛైర్మన్ మహ్మద్ ఖలీద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే పలు స్టాళ్లను ప్రత్యేక కమిషనర్ హనుమంత్ కె జెండగే కలియ తిరిగి పరిశీలించారు. ఈరోజు నుంచి సెప్టెంబరు 5 వరకు 6 రోజుల పాటు జరగనున్న ఉద్యాన ప్రదర్శనలో150 పైగా స్టాళ్లు కొలువు తీరాయి. వ్యవసాయ, ఉద్యాన రంగంలో వస్తున్న సరికొత్త పోకడల నేపథ్యంలో అన్నదాతలు.. ప్రత్యేకించి జంట నగరవాసుల టెర్రస్ గార్డెనింగ్ కోసం అవసరమైన విత్తనాలు, వివిధ రకాలు, జాతుల పూలు, కూరగాయలు, పండ్ల మొక్కలు, కుండీలు, వర్మీ కంపోస్ట్, ఇతర పనిముట్ల ప్రదర్శన, విక్రయం సాగుతోంది.
Grand Nursery Mela in Hyderabad: ఉత్సాహంగా సాగుతున్న "జాతీయ ఉద్యాన ప్రదర్శన"
Grand Nursery Mela in Peoples Plaza : కరోనా నేపథ్యంలో సుగంధ, ఔషధ మొక్కల ప్రాధాన్యత తెలుసుకున్న క్రమంలో.. ఆయా జాతులు, రకాలు అందుబాటులోకి తీసుకొచ్చి స్టాళ్లను ఏర్పాటు చేశారు. కొత్తగా మనీప్లాంట్ ఐదారు రకాలతో అందుబాటులో ఉంచారు. ప్రత్యేకంగా బెంగళూరు గులాబీ, డచ్ గులాబీ, హాలండ్ గులాబీ, ఎడీనియం, జామియా సైకస్, బేబీ డాల్, అంతేరియం, అండ్రేంజా ఇండోర్, అవుట్‌డోర్ ప్లాంట్స్ ప్రదర్శన, విక్రయాలు సాగుతున్నాయి. హాంగింగ్ మోతీ - ముత్యం రకం తీగ జాతి మొక్క కూడా సందర్శకులను ఆకర్షించింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో తక్కువ ప్రతి నీటి చుక్క వినియోగించుకోడానికి హైడ్రోపొనిక్ టెక్నాలజీ, సూక్ష్మ సేద్యం టెక్నాలజీ సంస్థలు తమస్టాళ్లను ఏర్పాటు చేశారు.