హైదరాబాద్ భరత్ నగర్‌లోని హరిహర క్షేత్ర దేవాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భక్తులెవరూ లేకుండానే జానకీ రాముల కల్యాణోత్సవం నిర్వహించారు. కరోనా వైరస్ మహమ్మారిని నివారించడానికే కల్యాణాన్ని భక్తులు లేకుండా జరిపించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆలయ అర్చకులు శ్రీరంగం రామానుజాచార్యులు, బలరామకృష్ణ, వెంకట గోపాల రత్నమాచార్యులు వెల్లడించారు.
వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం - Sitarama_Kalyanam
హైదరాబాద్ భరత్‌నగర్‌లో సీతా రాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరికీ విముక్తి లభించాలని కోరుకున్నట్లు ఆలయ అర్చకులు శ్రీరంగం రామానుజాచార్యులు, బలరామకృష్ణ, వెంకట గోపాల రత్నమాచార్యులు పేర్కొన్నారు.
జానకీ రామ కల్యాణం వైభోగమే