తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఘనంగా దత్తోపంత్ జన్మ శతాబ్ది ఉత్సవాలు' - SHRADDAYA DATTHO PANTH RENGDEEJI

భారతీయ మజ్దూర్ సంఘ్, స్వదేశీ జాగరణ మంచ్ సంస్థాపకుడు శ్రద్దెయ దత్తో పంత్ రేంగ్డీజీ శతాబ్ది వేడుకలు సికింద్రాబాద్​లో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా దత్తోపంత్ శత జయంత్యుత్సవాలు

By

Published : Nov 14, 2019, 5:30 PM IST

బీఎంఎస్ భారతీయ కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ మంచ్ వ్యవస్థాపకులు, సామాజిక సంస్థల రూపశిల్పి శ్రద్దెయ దత్తోపంత్ రేంగ్డీజీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ హరిహర కళా భవన్​లో కార్మిక రైతు నేత దత్తోపంత్ జన్మ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు దత్తో పంత్ జన్మ శతాబ్ది ఆధ్వర్యంలో 10 నవంబర్ 2019 నుంచి 10 నవంబర్ 2020 వరకు జన్మ శతాబ్ది కార్యక్రమాలు ఘనంగా చేపట్టాలని నిర్ణయించారు. మహోద్యమ కార్మిక రైతు ఉద్యమ నేత స్వదేశీ స్వాభిమాన ఆందోళనకారుడు దత్తో పంత్ అని తెలంగాణ ఉత్సవ సమితి కో కన్వీనర్ లక్ష్మణా చార్య అన్నారు.
'లోక కల్యాణం కోసం కృషి చేయాలనేది ఆయన నినాదం'
ప్రపంచ మానవ హక్కు దారులుగా ఎదగండి... విశ్వమానవ సౌభ్రాతృత్వం గురించి ఆలోచించండి... లోక కల్యాణం కోసం కృషి చేయండని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు కర్షక లోకమంతా కదిలిందన్నారు. భారత గ్రామీణ ప్రాంతాల్లో స్వదేశీ స్వాభిమానం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లిన మహనీయుడిగా ఆయనను కొనియాడారు.

ఘనంగా దత్తోపంత్ శత జయంత్యుత్సవాలు
ఇవీ చూడండి : ఆర్టీసీ సమ్మె - అట్టుడుకుతున్న రాష్ట్రం

ABOUT THE AUTHOR

...view details