కార్మికుల శ్రేయస్సు కోరి జీహెచ్ఎంసీ అమలుపరుస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని జాతీయ సఫాయి కర్మచారి ఛైర్మన్ వాల్జే బాయ్ జాల స్పష్టం చేశారు. సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో సఫాయి కర్మచారి చైతన్య సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అందిస్తున్న సంక్షేమాలకు సంబంధించి కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం జీహెచ్ఎంసీ పరిధిలో ఉత్తమ కర్మాచారిగా ఎంపికైన ఐదుగురిని సన్మానించారు.
సికింద్రాబాద్లో ఘనంగా సఫాయి కర్మచారి చైతన్య సదస్సు
కార్మికులకు లభించే ప్రయోజనాలపై వారికి అవగాహన పెంపొందించేందుకు సికింద్రాబాద్లో సఫాయి కర్మచారి చైతన్య సదస్సు నిర్వహించింది జీహెచ్ఎంసీ.
కార్మికులు తమ ప్రయోజనాలు తెలుసుకునేందుకు ఈ సదస్సు ఎంతో ఉపయోగకరం : వాల్జీ భాయి జాల
జీహెచ్ఎంసీ అందిస్తోన్న ఈఎస్ఐ, పీఎఫ్ బ్యాంకు లోన్స్, కార్మికుల ఆరోగ్యం కోసం ఉచిత కంటి పరీక్షలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు ఈ సదస్సు ఎంతో తోడ్పడుతుందని జాతీయ సఫాయి కర్మచారి ఛైర్మన్ వాల్జే బాయ్ జాల ప్రశంసించారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు జగదీశ్ హీర్మని, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి : సమ్మెపై ప్రభుత్వ, యూనియన్ల తీరుపై హైకోర్టు అసంతృప్తి