తెలంగాణ

telangana

ETV Bharat / state

జోరుగా ఓటరు నమోదు... 34వేలకు పైగా దరఖాస్తులు - ఎలక్టోరల్​ రిజిస్ట్రేషన్​ అధికారి పంకజ వార్తలు

మహబూబ్​నగర్​-రంగారెడ్డి-హైదరాబాద్​ ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి అక్టోబర్​ 1నుంచి ఇప్పటివరకు 34,514 దరఖాస్తులు వచ్చినట్లు ఈఆర్​వో పంకజ తెలిపారు. నవంబర్​ 6వరకు గడువు ఉన్న నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

graduate-voter-registration-for-mlc-elections-at-mahaboobnagar-and-ranga-reddy-and-hyderabad
జోరుగా ఓటరు నమోదు... 34వేలకు పైగా దరఖాస్తులు

By

Published : Oct 6, 2020, 7:34 PM IST

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్-రంగారెడ్డి-హైద‌రాబాద్ ప‌ట్టభ‌ద్రుల నియోజకవర్గంలో ఓటర్ల నమోదుకై ఇప్పటివ‌ర‌కు 34,514 ద‌ర‌ఖాస్తులు అందినట్లు ఎలక్టోరల్​ రిజిస్ట్రేషన్​ అధికారి పంకజ తెలిపారు. అర్హులైన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకునేందుకు వీలుగా 178 మంది డిజిగ్నేటడ్​ అధికారులను నియమించినట్లు వెల్లడించారు.

అధికారులు పట్టభద్రుల నుంచి ఫారం-18 క్లైమ్​లను తీసుకొని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆన్​లైన్​లో అప్లై చేసుకునేవారు... http://www.ceotelangana.nic.in వెబ్​సైట్​లో వివరాలు నమోదు చేయవచ్చని వెల్లడించారు. దరఖాస్తు చేసుకునేందుకు న‌వంబ‌ర్ 6 వ‌ర‌కు గడువు ఉన్నట్లు ఈఆర్‌వో పేర్కొన్నారు.

ఇదీ చూడండి:నిజామాబాద్​ ఎమ్మెల్సీ ఎన్నికలో తెరాస గెలుపు తథ్యం: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details