పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 14న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన - Details of Graduate MLC Election
13:10 February 11
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన
ఖమ్మం-వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల స్థానంతో పాటు మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. మార్చి 14 న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఫిబ్రవరి 23 గడువుగా ఈసీ నిర్ణయించింది. ఈనెల 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 26 వరకు గడువుగా నిర్ణయించారు. మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపడతారు. మార్చి 22వరకు ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ పూర్తికానుంది.
ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని ఈసీ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించింది.
షెడ్యూల్ వివరాలు
నామినేషన్ల స్వీకరణ | ఫిబ్రవరి 23 |
నామినేషన్ల పరిశీలన | ఫిబ్రవరి 24 |
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ | ఫిబ్రవరి 26 |
పోలింగ్ | మార్చి 14 |
ఓట్ల లెక్కింపు మార్చి | మార్చి 17 |
- ఇదీ చూడండి: తొలిసారిగా ఇద్దరు మహిళలకు గ్రేటర్ పీఠం