హైదరాబాద్‌లో ప్రజా రవాణా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రధానంగా ఆర్టీసీ సిటీ సర్వీసులు పూర్తిస్థాయిలో నడవడం లేదు. ఇప్పటికీ చాలామంది వ్యక్తిగత వాహనాల్లోనే వెళుతుండడం వల్ల రహదారులపై ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. వాహనాలపై వెళ్లడం ఇష్టంలేని వారు మెట్రోని ఆశ్రయిస్తున్నారు. వీరంతా మెట్రో స్మార్ట్‌కార్డు, క్యూఆర్‌కోడ్ టికెటింగ్ వాడుతున్నారు. కౌంటర్ల వద్ద రద్దీని నివారించేందుకు చెన్నైలో మెట్రో పునఃప్రారంభం తర్వాత క్యూఆర్ కోడ్ టికెటింగ్ ఛార్జీలపై 20 శాతం రాయితీని ఇచ్చారు. మన వద్ద క్యూఆర్‌కోడ్ టికెట్లపై ఎలాంటి రాయితీ లేదు.
మెట్రోలో ప్రయాణాలు పూర్వస్థితికి రావాలంటే మరికొన్ని నెలలు పడుతుందంటున్నారు. అప్పుడూ 75 శాతానికి మించకపోవచ్చని విశ్లేషణలు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరులో కొవిడ్‌కు ముందు సగటున నిత్యం 4.5 లక్షల మంది ప్రయాణించేవారు. ఇప్పుడు యాభై వేలకు అటుఇటుగా ఉంటున్నాయి. విదేశాల్లోనూ కరోనా కేసులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితినే అక్కడి మెట్రోలు, సబ్‌వేలు ఎదుర్కొ న్నాయి.
మరికొన్ని నెలలు..