తెలంగాణ

telangana

ETV Bharat / state

డాక్టర్ గంగపట్నం రాధాకృష్ణారెడ్డి పుస్తకం విడుదల - హైదరాబాద్ లేటెస్ట్ న్యూస్

వ్యవసాయ రంగంలో ఎంతో కృషి చేసిన రైతు మిత్రులు డాక్టర్ గంగపట్నం రాధాకృష్ణారెడ్డి ఆత్మకథగా రూపొందిన పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్ బీఎస్ రాములు ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఆయన బాల్యం, విద్యాభ్యాసం, విదేశీ విద్య మొదలైన ఎన్నో విశేషాలు ఉన్నాయని పేర్కొన్నారు. బెంగుళూరును దేశంలోనే అత్యున్నత యాంత్రిక రంగ వినియోగ శిక్షణా సంస్థగా ఆయన తీర్చిదిద్దారని కొనియాడారు.

gr reddy autobiography book released by bs ramulu in hyderabad
డాక్టర్ గంగపట్నం రాధాకృష్ణారెడ్డి పుస్తకం విడుదల

By

Published : Nov 8, 2020, 7:36 PM IST

వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులను ప్రఖ్యాత రైతు మిత్రులు డాక్టర్ గంగపట్నం రాధాకృష్ణారెడ్డి తీసుకువచ్చారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్ బీఎస్ రాములు తెలిపారు. జీఆర్ రెడ్డి ఆత్మకథగా రూపొందించిన పుస్తకాన్ని హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు. రిమెంబెరెన్స్‌ ఆఫ్ బైగాన్ డేస్ పేరుతో రచించిన తన బాల్యం, విద్యాభ్యాసం, ఉన్నత విదేశీ విద్య, డాక్టరేట్‌, వ్యవసాయ విశ్వవిద్యాలయ, కళాశాలల్లో ఉద్యోగం, ఎస్కార్ట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మ్‌ మెకనైజేషన్‌ అండ్ అగ్రికల్చరల్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనింగ్ సెంటర్ మొదలైన విశేషాలు వివరించారని పేర్కొన్నారు.

బెంగుళూరును దేశంలోనే అత్యున్నత యాంత్రిక రంగ వినియోగ శిక్షణా సంస్థగా తీర్చిదిద్దిన ఘనత, కుటుంబం, ఆధ్యాత్మిక చింతన, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం, సామాజిక సేవలు, విశేష వర్ణ చిత్రాల సమాహారంగా రూపొందించారని బీఎస్ రాములు వివరించారు. ప్రచారాన్ని కోరుకోకపోవడం వల్ల ఆయన కృషి నిశ్శబ్దంగా ఉండిపోయిందని, అవకాశం ఉంటే పద్మశ్రీ రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:ధాన్యం ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు.. రైతుల ఆందోళన..

ABOUT THE AUTHOR

...view details