రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సినీ నటుడు కత్తి మహేశ్(Kathi mahesh ) వైద్య సహాయానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసింది. చెన్నైలోని అపోలో(apolo hospital) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్ వైద్యం కోసం రూ.17లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి సహాయనిధి(CM relief fund) కింద ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
Kathi mahesh: కత్తి మహేశ్ చికిత్సకు ప్రభుత్వం రూ.17 లక్షలు ఆర్థికసాయం
సినీ విశ్లేషకులు, సినీ నటుడు కత్తి మహేశ్ (Kathi mahesh ) వైద్యం కోసం ఏపీ ప్రభుత్వం రూ.17లక్షలు ఆర్థిక సహాయం చేసింది. ముఖ్యమంత్రి సహాయనిధి(CM relief fund) ద్వారా ఈ మొత్తాన్ని విడుల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీ కొట్టింది. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను నెల్లూరు ఆసుపత్రి నుంచి చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. ముక్కులో ఒక ఫ్యాక్చర్, కంటిలోపల మరో గాయమైందని తెలిపారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తిగా కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని సన్నిహితులు తెలిపారు.
ఇదీచదవండి:TS-AP WATER WAR: ప్రాజెక్ట్‌ల వద్ద కొనసాగుతున్న పోలీసుల పహారా