తెలంగాణ

telangana

ETV Bharat / state

Parking fee: థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుకు ఉత్తర్వులు జారీ - పార్కింగ్‌ ఫీజు వసూలుకు ఉత్తర్వులు

రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు వసూలుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అందుకు అనుగుణంగా జీవో నంబరు 63ను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.

parking fee in single screen theatre
థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు వసూలుకు ప్రభుత్వం అనుమతి

By

Published : Jul 20, 2021, 8:52 PM IST

కరోనా కారణంగా మూతపడిన సినిమా థియేటర్లకు రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఊరట కల్పించింది. ఆర్థికంగా వెసులుబాటు కలిగేలా.. పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేందుకు అనుమతించింది. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో... వాహనాల పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.

జీవో సవరణ

గతంలో 2018లో పార్కింగ్ ఫీజులను రద్దు చేస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 63ను తాజాగా సవరించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని ఆదేశించింది. మల్టీప్లెక్స్‌లు, వ్యాపార వాణిజ్య సముదాయాల్లో... పార్కింగ్ ఫీజు వసూలు చేయవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే పార్కింగ్ ఫీజు ఎంత వసూలు చేయాలనే దానిపై.. థియేటర్ నిర్వాహకులకే వదిలేసింది.

థియేటర్లను ఆదుకోవాలని మంత్రికి విజ్ఞప్తి

కరోనా కారణంగా నష్టపోయిన సినిమా థియేటర్లను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ఫిల్మ్‌ ఛాంబర్‌ కోరింది. దీనిపై ఇప్పటికే ఛాంబర్‌ సభ్యులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం అందజేశారు. గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో విషయంలో పునరాలోచించాలని.. అలాగే పార్కింగ్‌ రుసుము, విద్యుత్తు ఛార్జీలు, పన్ను చెల్లింపు విషయాల్లో మినహాయింపులు ఇవ్వాలని కోరారు. ఎగ్జిబిటర్ల సమస్యలను ప్రభుత్వం పరిశీలించి సినిమా పరిశ్రమను కాపాడాలని కోరారు. థియేటర్ల సమస్యల పరిష్కారానికి సంబంధించి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సానుకూలంగా స్పందించారు. ఈనెల 23వ తేదీ నుంచి కొత్త సినిమాలు ప్రదర్శించాలని భావిస్తున్నారు.

ఇదీ చూడండి:

తెలంగాణలో నేటి నుంచి థియేటర్లు ఓపెన్

ABOUT THE AUTHOR

...view details