Age Relaxation: ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 80వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని శాసనసభ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. వయో పరిమితిని కూడా పెంచుతామని స్పష్టం చేశారు. అందుకు అనుగుణగా సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయో పరిమితిని పదేళ్లపాటు పెంచింది. దీంతో 34 ఏళ్లుగా ఉన్న గరిష్ఠ అర్హత వయస్సు 44 ఏళ్లకు పెరిగింది. గరిష్ఠ వయో పరిమితి పెంపు రెండేళ్ల పాటు వర్తించనుంది. ఉత్తర్వులు జారీ అయిన రోజు నుంచి రెండేళ్ల పాటు అంటే 2024 మార్చి 18 వరకు ఈ వెసులుబాటు ఉంటుంది. అయితే, యూనిఫాం సర్వీసులైన పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, అటవీశాఖ ఉద్యోగాలకు మాత్రం గరిష్ఠ వయో పరిమితి పెంపు వర్తించదు.
Age Relaxation: గరిష్ఠ వయోపరిమితి పెంపుపై ప్రభుత్వం ఉత్తర్వులు
Age Relaxation: వారం, పది రోజుల్లోపే భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మంత్రులు, అధికారులతో శనివారం సమావేశమైన సీఎం... నియామకాల అంశంపై కూడా చర్చించినట్లు తెలిసింది. ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
వారం, పది రోజుల్లోపే భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మంత్రులు, అధికారులతో శనివారం సమావేశమైన సీఎం... నియామకాల అంశంపై కూడా చర్చించినట్లు తెలిసింది. 80,039 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో తదుపరి ప్రక్రియ పురోగతిపై సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసి నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ దిశగా అవసరమైన కసరత్తు పూర్తి చేయాలని మంత్రి హరీష్ రావు, ఆర్థికశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్లు ఇవ్వాలన్న కేసీఆర్... వారం, పది రోజుల్లో 20 నుంచి 30 వేల వరకు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటనలు జారీ చేయాలని చెప్పినట్లు తెలిసింది.
ఇదీ చూడండి: