తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్లకోమా వ్యాధికి చికిత్స: ఈటల - RYAALI FROM HOSPITAL TO MASABTANK

ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ఈ నెల 10 నుంచి 16 వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. గ్లకోమా వ్యాధికి తగిన చికిత్స అందించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి ఈటల స్పష్టం చేశారు.

గ్లకోమా వారోత్సవాలను ప్రారంభించిన ఈటల

By

Published : Mar 10, 2019, 1:32 PM IST

గ్లకోమా వ్యాధి నివారణకు ప్రభుత్వం కృషిచేస్తోంది : ఈటల
గ్లకోమా కంటి వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఇవాళ మెహిదీపట్నం సరోజినీదేవి కంటి ఆసుపత్రి నుంచి మాసబ్ ట్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్లకోమా వీక్​ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు.

గ్లకోమా ముందస్తుగానే గుర్తించాలి

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'కంటి వెలుగు'లో భాగంగా గ్లకోమా వ్యాధి నివారణకు ప్రభుత్వం కృషిచేస్తోందని ఈటల పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ మెుదటి దశలోనే గ్లకోమాను గుర్తించి తగిన చికిత్సలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వారం రోజుల పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉచిత చికిత్స అందిస్తామని సరోజినీదేవి కంటి ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details