రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో పశువైద్యాధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో టీకా మందులు అందుబాటులో ఉన్నాయని పశుసంవర్ధకశాఖ సంచాలకులు డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి అన్నారు. అత్యవసర సేవలకు టోల్‌ఫ్రీ నంబరు 1962 ఏర్పాటు చేశామన్నారు. సంచారం వైద్యశాలలను రైతులు వినియోగించుకోవాలన్నారు.
భారీ వర్షాలతో పశువైద్యాధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం - పశువైద్యాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ
భారీ వర్షాల వల్ల జనజీవనం స్తంభించడంతో పాటు మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పశువైద్యాధికారులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో అవసరమైన అన్ని రకాల టీకా మందులు అందుబాటులో ఉంచామని పశుసంవర్ధకశాఖ సంచాలకులు డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి తెలిపారు.
![భారీ వర్షాలతో పశువైద్యాధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం Govt gives Important Instructions to Veternery doctors](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9184606-238-9184606-1602764723101.jpg)
భారీ వర్షాలతో పశువైద్యాధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం
గ్రామాల పరిధిలో పశువైద్యాధికారులు సకాలంలో స్పందిచాలని ఆయన సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరదల కారణంగా పలు జిల్లాల్లో 60 గేదేలు, 246 గొర్రెలు, 35 మేకలు, 10,700 కోళ్లు మృత్యువాతపడ్డాయని వెల్లడించారు. త్వరలోనే అన్ని జిల్లాల నుంచి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని పశుసంవర్ధకశాఖ సంచాలకులు పేర్కొన్నారు.