హైదరాబాద్ కోఠి వైద్య, విద్యా సంచాలకుల కార్యాలయం ముందు ప్రభుత్వ వైద్యులు ఆందోళనకు దిగారు. క్యారీడ్ అడ్వాన్స్మెంట్ స్కీం పెంచిన తరువాతనే వయోపరిమితి మీద నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. ఈవిషయంలో జూనియర్ డాక్టర్స్‌తో ప్రభుత్వం చర్చలు జరిపి తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. దీనిపై ఒకప్పుడు వ్యతిరేకించిన డీఎంఈ ఇప్పుడు ఎవరితో చర్చించకుండా వయోపరిమితి మీద నిర్ణయం తీసుకోవడం సరైనది కాదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకున్న డీఎంఈ రమేష్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని వైద్యుల సంఘము నాయకులు డిమాండ్ చేశారు.
డీఎంఈని తొలగించాల్సిందే... - Govt Doctors Protest in Hyderabad
క్యారీడ్ అడ్వాన్స్మెంట్ స్కీం పెంచిన తరువాతనే వయోపరిమితి మీద నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్ కోఠిలో ప్రభుత్వ వైద్యులు ఆందోళనకు దిగారు. స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకున్న డీఎంఈ రమేష్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
![డీఎంఈని తొలగించాల్సిందే...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3598140-443-3598140-1560880844864.jpg)
డీఎంఈని తొలగించాల్సిందే...