తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరణిస్తే అంత్యక్రియలు ఉచితం - గ్రేటర్‌లో కొవిడ్‌ మృతులకు ఉచితంగా అంతిమయాత్ర

గ్రేటర్​లో కొవిడ్​తో మరణిస్తే అంత్యక్రియలు ఉచితంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి కేటీఆర్​ ఆదేశాలతో సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ప్రకటించారు. ఇంట్లో గానీ, ఏ ఆసుపత్రుల్లోనైనా కరోనాతో చనిపోతే అంతిమయాత్రకు వాహనాలు ఉచితంగా పంపిస్తామన్నారు.

Govt decided for Funerals are free in case of death
గ్రేటర్​లో కొవిడ్​తో మరణిస్తే అంత్యక్రియలు ఉచితం

By

Published : May 25, 2021, 10:04 AM IST

గ్రేటర్‌లో కొవిడ్‌ మృతులకు ఉచితంగా అంతిమయాత్ర రథాలను కేటాయిస్తూ సోమవారం సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు పురపాలక శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ప్రకటించారు. ప్రైవేటు వాహనదారులు మృతదేహాల తరలింపునకు భారీగా వసూలు చేస్తుండటంతో, అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఇంట్లో గానీ, ఏ ఆసుపత్రుల్లోనైనా కరోనాతో చనిపోతే అంతిమయాత్రకు వాహనాలు ఉచితంగా పంపిస్తామన్నారు. ఇంటివద్ద, ప్రైవేటు వైద్య శాలల్లో అయితే నిర్ణీత ధరలు వసూలు చేయనున్నారు.

ఆరు జోన్లలో సేవలు

హైదరాబాద్​లో 6 జోన్లకు కలిపి 14 వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. అవసరమైనవారు జోన్లవారీగా ఇన్‌ఛార్జులకు ఫోన్‌ చేసి సేవలను పొందాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్‌ మృతులకు అంతిమ యాత్ర రథంతోపాటు అంత్యక్రియలూ ఉచితమేనని గుర్తుచేశారు. పురపాలక శాఖ కార్యదర్శి సోమవారం ఈఎస్‌ఐ, అంబర్‌పేట, పంజాగుట్ట, బన్సీలాల్‌పేట శ్మశానవాటికలను సందర్శించారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడి, పౌరులకు సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఉచిత అంతిమ యాత్ర రథం, అంత్యక్రియల విషయమై ఎలాంటి ఫిర్యాదులున్నా 24 గంటలపాటు పనిచేసే జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌రూం నంబరు 040-2111 1111ను సంప్రదించాలని ప్రజలను కోరారు.

జోన్లవారీ ఇంఛార్జుల ఫోన్‌ నంబర్లు :

* ఎల్బీనగర్‌: కుమార్‌ 9100091941, వెంకటేశ్‌ 9701365515

* చార్మినార్‌: నాయక్‌ 9440585704, బాల్‌రెడ్డి 9849907742

* ఖైరతాబాద్‌: రాకేశ్‌ 7995009080

* కూకట్‌పల్లి: చంద్రశేఖర్‌రెడ్డి 7993360308, శ్రీరాములు 9515050849

* శేరిలింగంపల్లి: మల్లారెడ్డి 6309529286, రమేష్‌కుమార్‌ 9989930253

* కంట్రోల్‌రూం 9154795942

* సికింద్రాబాద్‌: రవీందర్‌గౌడ్‌ 7993360302, శంకర్‌ 9100091948

ఇదీ చూడండి:రాష్ట్రంలో నేటి నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్

ABOUT THE AUTHOR

...view details