తెలంగాణ

telangana

ETV Bharat / state

Govt On Rice: సన్నాల కొనుగోలుకు సర్కారు సన్నద్ధం.. అదనంగా సేకరణ - సన్న బియ్యం

రాష్ట్రంలో ముడిబియ్యం సేకరించేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. కస్టమ్​ మిల్లింగ్ రైస్​ సరఫరాకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్​ వాడీ కేంద్రాలకు అవసరమైన బియ్యం సేకరించనుంది. అదనంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Govt decide to purchase raw rice
సన్న బియ్యం సేకరణకు సర్కారు సిద్ధం

By

Published : Jul 24, 2021, 4:53 AM IST

రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ అమల్లో భాగంగా ముడిబియ్యం కొనుగోలుకు సర్కారు ప్రాధాన్యత ఇస్తోంది. కస్టమ్ మిల్లింగ్ రైస్ సరఫరాకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు, సాంఘీక సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన సన్న బియ్యం సేకరించనుంది. అదనంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో అనూహ్యంగా పెద్ద ఎత్తున ధాన్యం ఉత్పత్తి కావడంతో రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో ఏకంగా 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన పౌరసరఫరాల శాఖ.. తాజాగా ధాన్యం సేకరించాలని నిర్ణయించింది.

తగ్గిన బియ్యం..

కొవిడ్ నేపథ్యంలో లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు ఎక్కువ రోజులు మూసివేయడం జరిగింది. అదే సమయంలో 1.38 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం నిల్వలు వినియోగించబడలేదు. కేవలం 80 వేల మెట్రిక్ టన్నుల సన్నా బియ్యం మాత్రమే వినియోగించారు. వాటిని 2020 డిసెంబర్ 31వ తేదీలోగా కనీస మద్దతు ధర కింద 16 కోట్ల రూపాయల వ్యయంతో సన్నాలు సేకరించింది.

రాష్ట్రంలో 2020-21 వానాకాలంలో పలు రకాల వరిని రైతులు సాగు చేయగా.. కొనుగోలు కేంద్రాలైన ఇందిరా క్రాంతి పథం, స్వయం సహాయక బృందాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ధాన్యం సేకరించింది. దాదాపు 75 శాతం సన్నాలు కొనుగోలు కేంద్రాలకు వచ్చాయి. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం రైస్ మిల్లులకు తరలించే క్రమంలో 10 శాతం పగిలిపోయి దెబ్బతిన్నాయి. అందువల్లే ఇక నుంచి విధిగా రాబోయే రోజుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద చౌక ధరల దుకాణాలు ద్వారా రేషన్ కార్డుదారులకు కూడా సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే.. ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక, సంక్షేమ వసతి గృహాలు, ఐసీడీఎస్ కేంద్రాలతోపాటు పలు సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి కూడా ఈ సన్న బియ్యం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండీ అనిల్‌కుమార్ పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

కొనుగోలు కేంద్రంలో మంత్రి హరీశ్ ఆకస్మిక తనిఖీలు

'కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయండి'

'ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి'

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్​

ABOUT THE AUTHOR

...view details