నగరంలో భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోయిన వారికి ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. పలు కాలనీలు నీటిలో మునిగిపోయి ప్రజలు సర్వం కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వరద బాధితులకు ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలి: చాడ - చాడ వెంకట్రెడ్డి డిమాండ్
హైదరాబాద్లో భారీ వరదలతో ఇళ్లు కూలిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. కేవలం లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించడం దారుణమన్నారు.
వరద బాధితులకు ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలి: చాడ
వరద బాధితులకు ప్రభుత్వం పదివేల ఆర్థికసాయం అందించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. దుబ్బాక ఉపఎన్నికలో లౌకిక వాదుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు చాడ వెంకట్రెడ్డి సూచించారు.