తెలంగాణ

telangana

ETV Bharat / state

స్కందగిరి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠ.. హాజరైన గవర్నర్‌, మంత్రి తలసాని - స్కందరిగి ఆలయం వార్తలు

సికింద్రాబాద్​ స్కందగిరి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కన్నుల పండువగా జరిగింది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున యజ్ఞ హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఆ ప్రాంగణమంతా పండుగ శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై, మంత్రి తలసాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

govrnor tamilisai
govrnor tamilisai

By

Published : Apr 21, 2022, 5:15 PM IST

సికింద్రాబాద్‌ పద్మారావు నగర్‌లోని స్కందగిరి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయంలో జరిగిన మహా కుంభాభిషేకం కన్నుల పండువగా జరిగింది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున యజ్ఞ హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో... పద్మారావు నగర్ ప్రాంగణమంతా పండుగ శోభను సంతరించుకుంది.

దేవాలయాన్ని దర్శించుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని గవర్నర్ తెలిపారు. కరోనా మహమ్మారి త్వరలోనే అంతం కావాలని ఆమె ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేసి... ఆలయ పునర్నిర్మాణానికి దోహదపడిన వారందరికీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సుబ్రహ్మణ్య స్వామి దీవెనలతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. స్వామి వారి విగ్రహ పునః ప్రతిష్ఠాపన కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details