జాతీయ విద్యా విధానం తెలంగాణ వంటి కొత్త రాష్ట్రానికి ఒక వరమని గవర్నర్ తమిళి సై సౌందరాజన్ అభిప్రాయపడ్డారు. ఇది దేశ విద్యా కేంద్రంగా ఉద్భవించే అవకాశం ఉందన్నారు. కొత్త విద్యా విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఎక్కువ సమన్వయం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊహించినట్లుగా భారతదేశాన్ని నాలెడ్జ్ పవర్‌హౌస్‌గా మారుస్తుందని ఆమె తెలిపారు.
జాతీయ విద్యా విధానం రాష్ట్రానికి ఒక వరం: గవర్నర్ - national education process news
జాతీయ విద్యా విధానం తెలంగాణ వంటి కొత్త రాష్ట్రానికి ఒక వరమని గవర్నర్ తమిళి సై సౌందరాజన్ అభిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఉన్నత విద్యను మార్చడంలో ఎన్ఈపీ 2020 పాత్ర అనే గవర్నర్స్ సమావేశంలో తమిళి సై సౌందరాజన్ ప్రసంగించారు. ప్రస్తుత విద్యావ్యవస్థను ఎన్ఈపీ సంస్కరిస్తుందన్నారు.
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఉన్నత విద్యను మార్చడంలో ఎన్ఈపీ 2020 పాత్ర అనే గవర్నర్స్ సమావేశంలో తమిళి సై సౌందరాజన్ ప్రసంగించారు. ప్రస్తుత విద్యావ్యవస్థను ఎన్ఈపీ సంస్కరిస్తుందన్నారు. 21వ శతాబ్దానికి భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న ప్రపంచ పౌరులకు బలమైన భారతీయ మూలాలతో శిక్షణ ఇవ్వడానికి వీలు కల్పిస్తుందన్నారు. బహుళ క్రమశిక్షణా విధానం ద్వారా ఆవిష్కరణ పరిశోధనలను ప్రోత్సహిస్తుందని గవర్నర్ తమిళి సై పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న ప్రభాస్